ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు.
ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి.
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28.
గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్ పార్టికి చెందిన నాయకుడు అనిల్ రావు తో కలసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినారు. కావున ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన చేసిన అధికారుల పై తగు చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ డిమాండ్ చేశారు.

