PS Telugu News
Epaper

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

📅 28 Feb 2026 ⏱️ 9:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు ఫిబ్రవరి 28.

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ని దుబ్బకాలువ గ్రామానికి వెళ్లే రోడ్డులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.. రేపు ఉదయం 11 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు… భూమి పూజ అనంతరం సభ ఉంటుంది… ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు.. వేలాదిమంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు… ఏర్పాట్లను మునుగోడు ఇంచార్జ్ తహసిల్దార్ నరేష్ తోపాటు స్థానిక నాయకులు పరిశీలించారు..

Scroll to Top