మునుగోడు లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మేం చిన్ననాడు చదువుకునేటప్పుడు బడిలో కులాల గురించి తెలియదు
అన్ని కులాల వాళ్ళం ఒకే బడిలో చదువుకునేవాళ్ళం
మళ్లీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కులాలకు అతీతంగా అందరూ కలిసి చదువుకోవచ్చు
దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చింది
ఈ స్కూళ్లు పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తోంది *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు
మునుగోడు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు భూమి పూజ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు 02.
మునుగోడులో ని దుబ్బ కాలువ రోడ్డులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీ జీ ఈ డబ్ల్యు ఐ డి సి ఎండి గణపతి రెడ్డి గార్లతో కలిసి భూమిపూజ చేసారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు.. అనంతరం అందరితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు…. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 2500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం చేసుకోవడం శుభపరిణామం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి వీటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకోబోతున్నారు మేము చిన్ననాటి చదువుకునేటప్పుడు కులాల గురించి తెలియదు అన్ని కులాల అన్ని మతాలవారు ఒకే ప్రాంగణంలో చదువుకునేవాళ్లం ఇప్పుడు ఇవి కూడా అలాంటి పాఠశాలే ఈ పాఠశాలలో అన్ని కులాల వారు అన్ని మతాలవారు కలిసిమెలిసి చదువుకోవచ్చు గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది కొందరికి బర్లిచ్చారు కొందరికి గొర్లిచ్చారు కొందరికి చేప పిల్లలు ఇచ్చారు.. కానీ నాణ్యమైన విద్యను అందించలేదు విద్య వైద్యాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కూళ్లు పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తోంది రాబోయే రెండు సంవత్సరాలలో ఈ స్కూలు నిర్మాణం పూర్తి అవుతుంది గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అవి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభమయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో 76 లక్షల ముప్పై ఐదువేల 115 మంది విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు ప్రైవేట్ సెక్టార్ లో 44 లక్షల మంది విద్యార్థులు చదివితే ప్రభుత్వ సెక్టార్లో 24 లక్షల మంది చదువుతున్నారు విద్య మొత్తం కార్పోరేట్ చేతిలోకి వెళ్ళిపోయింది కనీసం 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో చదివే అవకాశం రావాలి బడ్జెట్లో 10 నుండి 15% బడ్జెట్ కేటాయిస్తే సాధ్యమవుతుంది బడ్జెట్లో విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి మునుగోడు నియోజకవర్గంలో 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.. వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 9, 700 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు మునుగోడులో విద్యావ్యవస్థలో సమూల మైన మార్పులు తీసుకురావాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెస్ చార్జీలను పెంచాం విద్య విషయంలో రాబోయే రోజుల్లో చాలా చేయాల్సి ఉంది హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మునుగోడు నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఎంతో చేయాల్సి ఉంది మొట్టమొదటి అడుగు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం నల్గొండ జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్.ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి శుభాభినందనలు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజ్ గోపాల్ రెడ్డి గారు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో పేద విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో అరకోర వసతులు ఉన్నాయి విద్యా వైద్యంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి విద్యా వైద్యాన్ని కార్పొరేట్ శక్తులు వ్యాపారంగా మార్చాయి ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉన్నది నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల రావడం శుభ పరిణామం
