సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02.
మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్ల తో కలిసి సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు… నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు చండూరు నాంపల్లి మర్రిగూడ గట్టుప్పల్ మండలాలకు చెందిన 98 మంది రైతులకు ఈ సబ్సిడీ వ్యవసాయ పరికరాలు మంజూరయ్యాయి… మంజూరైన వాటిలో బ్యాటరీ స్పెయర్లు, తైవాన్ స్పెయర్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, ఎంబి ఫ్లవ్, కేజీ వీల్స్, పవర్ గ్రేడర్లు, బ్రష్ కట్టర్లు మొదలగు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి…మంజూరైనా పనిముట్లను రైతులకు స్వయంగా అందించారు గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు ఈ పంపిణీ కార్యక్రమం లో నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, చండూరు ఆర్డీవో శ్రీదేవి,వ్యవసాయ శాఖ ఏడి వేణుగోపాల్, వివిధ మండలాలకు చెందిన ఏవోలు , వివిధ క్లస్టర్ లకు చెందిన ఏఈవో లు పాల్గొన్నారు….