PS Telugu News
Epaper

మున్సిపల్ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి.

📅 02 Mar 2026 ⏱️ 2:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {మార్చ్ 3 మక్తల్}

ఈరోజు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రి. నెం -H -96 (TUCI అనుబంధ) మక్తల్ కమిటీ ఆధ్వర్యంలో రెండు నెలల పెండింగ్ వేతనాలు మరియు నాలుగు నెలల పిఎఫ్ పెండింగ్ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రగతిల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొలిమిరాములు అధ్యక్షత వహించగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ హాజరై ప్రసంగిస్తూ కార్మికులకు ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు చెల్లించాలని జీవో ఉన్నప్పటికిని జీతాలు చెల్లించకుండా అలసత్వం చేయడం చట్ట విరుద్ధమని అన్నారు స్థానిక మున్సిపల్ కమిషనర్ చట్టాన్ని అమలు చేయకుండా దాటవేత ధోరణి ఏంటని ప్రశ్నించారు. రెండు నెలల జీతాలు పెండింగ్ ఉండడం కారణంగా కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. వైద్య ఖర్చులు, ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, పిల్లల పాఠశాల ఫీజులు తదితర విషయాలు అప్పులు చేసుకొని చెల్లించి మరి వడ్డీలు కట్టలేని స్థితి ఏర్పడుతుందన్నారు సకాలంలో వేతనాలు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉందన్నారు. బట్టలు, చెప్పులు, సబ్బులు, బ్లౌజులు, తదితర సేఫ్టీ పరికరాలు సకాలంలో ఇవ్వటం లేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు నాలుగు నెలలు పిఎఫ్ పెండింగ్ పెట్టడం అనేది నిర్లక్ష్యపు ధోరణినీ తెలియజేస్తుందన్నారు. వెంటనే పిఎఫ్ పెండింగ్ డబ్బును చెల్లించి రెగ్యులర్ చేయాలని కోరారు.తెలంగాణ ప్రగశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జి కృష్ణయ్య బండారి బాలు రామలింగం గిరి జాకీర్ టీ మూర్తి బాలకృష్ణ బాబు బండారి రవి నరేందర్ బండారి మల్లేష్ బాలమ్మ పద్మమ్మ వెంకటేష్ ఆకాష్ రాయికోడ్ అంజి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top