తెలుగు ప్రపంచ మహా సభలలో ప్రముఖులకు సన్మానం
పయ నించే సూర్యుడు, మార్చి 2, 2026: అమలాపురం
అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ
ప్రాంగణంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అతిథులను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్ పాల్గొన్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషా వైభవాన్ని, సాహిత్య సంపదను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజలు, సాహిత్యవేత్తలు మరియు ప్రజాప్రతినిధుల విశేష ఆదరణ పొందింది. మహాసభల విజయవంతమైన నిర్వహణకు అందరూ కృషి చేసారని చైర్మన్ చైతన్య రాజు తెలిపారు