PS Telugu News
Epaper

ఘనంగా లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి…

📅 03 Mar 2026 ⏱️ 4:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఘాట్ లో నివాళులు అర్పించిన పలువురు నేతలు…

ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు…

జనం న్యూస్ మార్చి మూడు ముమ్మిడివరం ప్రతినిధి

కోనసీమ అభివృద్ధి పథంలో నడిపించిన లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 24 వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పట్టణమలోని నల్లవంతెన సమీపంలోని బాలయోగి ఘాట్ లో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తొలుత ఎంపీ హరీష్ బాలయోగి నివాసంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం ముగించుకున్న అనంతరం నివాసం వద్ద నుండి ఎంపీ హరీష్ ర్యాలీగా ఘాట్ కు చేరుకున్నారు. ఘాట్ లోని బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.నివాళులు అర్పించిన పలువురు నేతలు…జీఎంసీ బాలయోగి వర్ధంతిని పురాషరించుకుని అమలాపురంలోని బాలయోగి ఘాట్ లో పలువురు నేతలు మాట్లాడుతూ బాలయోగి దేశానికి మరియు కోనసీమకు చేసిన సేవలను గుర్తుచేశారు.ఘాట్ లో నివాళులు అర్పించిన వారిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రాజోలు టీడీపీ ఇంచార్జ్ గొల్లపల్లి అమూల్య, మాజీ ఎమ్మెల్యేలు చెల్లి వివేకానంద, చిల్లా జగదీశ్వరి, ఎక్స్ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, అల్లాడ సోంబాబు, మార్కెట్ కమిటీ చైర్మెన్ లు చిట్టూరి శ్రీవాస్, కేతా లక్ష్మి, చిక్కాల గణేష్, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, మట్టపర్తి భారతి, భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, , కల్వకోలను తాతాజీ, ఏడిద శ్రీను, మోకా వెంకట సుబ్బారావు డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ అమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారులు తదితరులు ఉన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం…రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ వారిచే ఎంపీ హరీష్ బాలయోగి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. సుమారు 600 వందల మంది వరకూ ప్రముఖ వైద్య నిపుణులచే గుండె మరియు నరాల సమస్యలు, ఎముకలు మరియు మోకాళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి పరీక్షలు, పిల్లల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ECHO, ECG, BP మరియు షుగర్ వంటి పరీక్షలు అక్కడే చేశారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

    Scroll to Top