PS Telugu News
Epaper

వైభవంగా శ్రీ లక్ష్మిచెన్నకేశవస్వామి రథోత్సవం

📅 03 Mar 2026 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

యాడికి, మార్చి 3, పయనించే సూర్యుడు (శర్మస్ వలి ):

యాడికి పట్టణంలో ఉన్న శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి రథోత్సవం ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు మంగళవారం వైభవంగా నిర్వహించారు.తెల్లవారుజామున శ్రీ చెన్నకేశవస్వామి కి, భూదేవి శ్రీ దేవి అమ్మ వార్లకు అభిషేకాలు చేసి, పూలమాలతో అలంకరించి,ప్రత్యేక పూజలు చేశారు.భక్తులు క్యూలో నిల్చుకోని శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామిని దర్శించి, కానుకలను సమర్పించారు.తెల్లవారజామున శ్రీ చెన్నకేశవస్వామి కి, భూదేవి, శ్రీ దేవీ అమ్మ కు కనులు పండుగగా కళ్యాణం నిర్వహించారు.ఉదయం ఉత్సవ విగ్రహాలను రథోత్సవం లో ఉంచి, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.పుర వీధుల గుండా మేళా తాళాలతో చెన్నకేశవ నామంతో రథాన్ని భక్తులు లాగినారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎఎస్పీ చౌహాన్,సిఐ శ్రీనివాసులు, పోలీసులు బందోబస్త్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలూరు రంగయ్య, రుద్రమ నాయుడు,మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, విజన్ విశ్వనాథ్, గుండా నారాయణస్వామి, తాండ్ర విక్రం,రూపునేని రాజశేఖర్,జనసేన మండల కన్వీనర్ సునీల్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు వద్ది రాజశేఖర్, వైకాపా ఎస్. ఈ సి మెంబర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, , తెదేపా,జనసేన, బీజేపీ, వైకాపా నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, తెదేపా, జనసేన, బీజేపీ, వైకాపా, నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు.

Scroll to Top