PS Telugu News
Epaper

ప్ర‌జా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్‌ వాక్‌  సర్పంచ్ సత్యం.

📅 04 Mar 2026 ⏱️ 2:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వార్డుల వారీగా తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం.

మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలపై దృష్టి సారించడం.

పెండింగ్ పనుల పరిశీలన, ఆచరణలో సమస్యల పరిష్కారం.

మార్నింగ్ వాక్ లో కస్తాల గ్రామ పంచాయతీ పాలక వర్గం.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మర్చి 05.

చండూరు మండలం కస్తాల సర్పంచ్ లేదన్న సత్యం  ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నింగ్‌ వాక్‌ కార్యక్రమానికి మెండు వారి గూడెంలో శ్రీకారం చుట్టామని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్య లు తెలుసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సర్పంచ్ అన్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉదయం పూట “మార్నింగ్ వాక్” (నడక) కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల ఇబ్బందులు విని, సత్వర పరిష్కారానికి హామీ ఇస్తూ, ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా గ్రామాభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు, ప్రజలకు చేరువయ్యే అవకాశం కలుగుతుంది.ప్రజలకు చేరువగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు మార్నింగ్‌ వాక్‌ ఉపయోగపడిందన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రజాప్రతినిధులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంతో పాటు, పాలనను మరింత పారదర్శకంగా మారుస్తాయి అన్నారు . ఈ కార్యక్రమంలో కస్తాల గ్రామ లేదన్న సర్పంచ్ సత్యంతో పాటు ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నరసింహ, వార్డు మెంబర్లు దోనాల శ్రీనివాస్ రెడ్డి, దోటి శ్రీను, గురజాల స్వామి, బొమ్మరబోయిన సైదులు మరియు కొల్లు పెద్ద మల్లారెడ్డి, అబ్బిడి జలంధర్ రెడ్డి, మెండు బ్రహ్మానందరెడ్డి , అబ్బిడి అంజిరెడ్డి , అబ్బిడి లింగారెడ్డి, మెండు ప్రతాపరెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి ,మెండు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top