PS Telugu News
Epaper

సమాచార హక్కు చట్టం బోర్డుఎక్కడ సారు… అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచారా హక్కు చట్టం

📅 04 Mar 2026 ⏱️ 6:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్,పయనించే సూర్యుడు. రుద్రూర్ మార్చ్ 4 :

రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సంస్థలు పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారు నిర్లక్ష్యంతో నీరు గారి పోతుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత సముదాయ కార్యాలయంలో సమాచార హక్కు బోర్డు లేకపోవడంతో, సమాచారం కోసం వచ్చినవారికి ఎవరికి దరఖాస్తు అందజేయాలో తెలియక ప్రజలు అయ్యో మయానికి గురవుతున్నారు. సహా హక్కు చట్ట ప్రకారం అగ్ని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటుచేసి దానిపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయించి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ముఖ్యంగా నిత్య ప్రజలతో రద్దీగా ఉండే తహసిల్దార్ కార్యాలయంలో అసలు సమాచార హక్కు బోర్డు లేకపోవడంతో ఎవరికి దరఖాస్తు చేయాలో తెలియక దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. మండల సమీకృత సముదాయ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ సమాచార హక్కు చట్టాన్ని నిరుగారుస్తున్నారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు

Scroll to Top