PS Telugu News
Epaper

కుల మతాల అతీతంగా కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి యువతి యువకులు సమాజ సేవ చేయడానికి ముందుకు రావాలి. గని శెట్టి

📅 05 Mar 2026 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అయినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర మహిళా జనసేన నాయకురాలు ముత్యాల మన్నెమ్మ గారి సహకారంతో 2000 రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు ఈరోజు వివేకానంద సేవాసమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టర్) చేతుల మీదగా ఇవ్వటం జరిగింది. దీనికిగాను కుటుంబ సభ్యులు, మన్నెమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లా గణేష్,యనమదల వెంకటరమణ,సరేళ్ళ గౌరీశంకర్,సూధా సత్యనారాయణ, సిహెచ్.ఏసుబాబు మరియు మన్నే సురేష్ లు పాల్గొన్నారు.

Scroll to Top