శ్రీనివాసా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా శక్తి – 2026
అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు
పయ నించే సూర్యుడు మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం సమీపంలో చెయ్యరు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవమును పురస్కరించు కొని శక్తి 2026 వేడుకల్ని కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి వి ఎన్ ఎస్ వర్మ జ్యోతిని ప్రజ్వలించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధి గ అమలాపురం డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ పి అర్జమ్మ ప్రసంగిస్తు మహిళా సాధికారత,
సమానత్వము నాయకత్వం, ఒకరికి సహాయం చేయుట ద్వారా అందరికీ ప్రయోజనం చేకూరుతుందనే నినాదంతో ఈ సం|| అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కళాశాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని, మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక , రాజకీయ, మహిళా సాధికారత ను చాటడం, మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించుట దీని ప్రధానోద్దేశమని విశ దీకరించారు. ఈ సందర్భంగా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవములను పురస్కరించుకొని, కళాశాల విద్యార్థినుల కు జస్ట్ ఎ మినిట్( జే ఏ ఎం) సోలో ది గ్రూప్ పాటల పోటీలు, డాన్స్, లఘు నాటికలు (స్కిట్), నిప్పులేకుండా వంటకము కళలు ఆర్ట్స్ మరియు చేతి సృజన్మాతతో, మెహందీ , త్రో బాల్, మ్యూజికల్ చైర్ , ఖో -ఖో పోటీలను నిర్వహించారు. తెలుగు దనం ఉట్టిపడేలా ప్రతి విద్యార్థినులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గున్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డి వి ఎన్ ఎస్ వర్మ బహుమతి ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలక వర్గ సభ్యులు శ్రీ సందీప్ , కళాశాల ప్రిన్సిపాల్ డా|| కె. సురేష్ బాబు, ,కళాశాల మహిళా సాధికారత విభాగము మహిళామణులు కన్వీనర్ డా || వి సాయి ప్రియా, డీన్ ఐ క్యూ ఏసి డా|| బి రత్న రాజు , కళాశాల విద్యార్థుల సంక్షేమ విభాగాధిపతి డా॥ బి . అరుణ్ కుమార్ , కళాశాల వివిధ విభాగపు అధిపతులు, అద్యాపకులు, మహిళా, అద్యాపకులు, విద్యార్థినులు పాల్గోన్నారు.
