PS Telugu News
Epaper

విద్యుత్ ఘాతంతో టిప్పర్ దగ్ధం…తప్పిన పెను ప్రమాదం..

📅 09 Mar 2026 ⏱️ 2:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 09.

విద్యుత్ ఘాతంతో టిప్పర్ దగ్ధం అయిన ఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బంగారిగడ్డ నుండి నాంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టిప్పర్లు మట్టి తరలిస్తున్నాయి. అందులో భాగంగా సోమవారం గ్రామ శివారులో మట్టి అన్‌లోడ్ చేస్తూ డ్రైవర్ ట్రాలీ కిందకు దింపకుండానే పైన ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్‌ను గమనించకుండా టిప్పర్‌ను ముందుకు తీసుకురావడంతో కరెంట్ షాక్ తగిలి మంటలు అంటుకుని టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. కరెంట్ షాక్‌తో అప్పటికే గాయపడిన డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ కాళ్లు, కడుపు భాగంలో తీవ్రంగా గాయాలు కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు.

Scroll to Top