నిర్మల్ పట్టణంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభించిన కౌన్సిలర్స్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
నిర్మల్ పట్టణంలోని బoగల్ పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పి ఎస్ సి పరిధిలోని రోగులు వైద్య శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ లు పలు ఆరోగ్య నియమాలను రోగులకు వివరించారు..6గురు స్పెషలిస్టుల తో వైద్య శిబిరం నిర్వహించారు… ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యులు మనీషా,మనసా, స్వామి, రవీనా, అభిలాష్, అరవింద్ మౌనిక, కౌన్సిలర్లు పేoడం శ్రీనివాస్, నరేష్, చైతన్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంశీ,, ఆసుపత్రి సిబ్బంది తదితరులున్నారు.
