PS Telugu News
Epaper

తానూర్ మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ…

📅 09 Mar 2026 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

తానూర్ మండలంలోని బోల్స గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న (వీవో) భవనానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమిపూజ నిర్వహించారు.అనంతరం జావ్లా-బి గ్రామంలో 10 లక్షల నిధులతో వీవో భవనం నిర్మాణానికి అలాగే 18లక్షల 40 వేల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా ఆయన భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇలాంటి నిర్మాణ పనులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top