PS Telugu News
Epaper

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

📅 09 Mar 2026 ⏱️ 7:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 10.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారము భోజన విరామ సమయంలో మండల వనరుల కేంద్రం చండూరులో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మొదటిరోజు మండల స్థాయిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు .

Scroll to Top