PS Telugu News
Epaper

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో రహదారులు మరియు డ్రైనేజీ లను శుభ్రపరచిన ప్రజలు

📅 10 Mar 2026 ⏱️ 4:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సదర్ లాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం

పయనించే సూర్యుడు, మార్చి 10,అశ్వాపురం : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు శుభ్రపరచడం, మురికి కాలువల పూడిక తీత, బ్లీచించ్ చల్లడం వంటి పనులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ గారు, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రజలు జగదంబ స్వీట్ రాథోడ్, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top