ఘనంగా సావిత్రి బాయి పూలే 129వ వర్ధంతి
సబ్బండ వర్గాల స్త్రీల విద్యాభివృద్ధికి మూలం – సావిత్రిబాయి పూలే
స్త్రీలు మనువాద బానిసత్వాన్ని తిరస్కరించొద్దనే – కట్టుకథలతో పురాణాల్లో బ్రాహ్మణ మహిళల ప్రస్తావన
మనువాద సంకెళ్ళను బద్దలు కొట్టి – మహిళ విద్యకు బాటలు వేసింది
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
{ పయనించే సూర్యుడు} {మార్చ్ 11మక్తల్ }
స్థానిక మక్తల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ…సామాజిక సంస్కరణ వాది సావిత్రి బాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలో జన్మించి, బాలికల,మహిళల విద్య కోసం భర్త జ్యోతిబాపూలేతో కలిసి 1848 లో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కిందన్నారు.పురాణాల్లోనీ బ్రాహ్మణుల కట్టుకథలకు పుట్టిన విషపు పుత్రికలను అసలైన విద్య,తాత్విక పండితులుగా కొలుస్తుండటం అది కచ్చితంగా కళ్ళుండి నిజాన్ని చూడలేని గుడ్డి తనమే అవుతుందన్నారు.ఆనాడు మహిళలతో పాటు విద్య నిషేధాన్ని ఎదుర్కొంటూన్న దళితులు మరియు పీడిత వర్గాల వారికి సైతం విద్యానందించి సబ్బండ వర్గాల క్రాంతిజ్యోతిగా కీర్తి గడించిందన్నారు.మహిళలను వంటింటి కుందేలుగా,లైంగిక వాంఛలు తీర్చే వస్తువులుగా చూసిన దుర్మార్గ మనువాద సంకెళ్ళను బద్దలు కొడుతూ 1848 నుండి 52 పుణే ప్రాంతంలో అనేక బడులను నిర్వహించి,వేలాది మంది బాలికల బతుకుల్లో వెలుగులు నింపిందన్నారు. డాక్టర్ అంబేద్కర్ మహాత్మ పూలే సావిత్రిబాయి పూలే వారసత్వ స్ఫూర్తితో రాజ్యాంగంలో మహిళలకు హక్కులు కల్పించాడని, ఆ క్రమంలోనే స్త్రీలకు ప్రత్యేక హక్కులను కల్పించే హిందూ కోడి బిల్లు ఓడిపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేసినా మహానీయుడు గొప్ప స్త్రీవాది అంబేద్కరన్నారు.సావిత్రి బాయి పూలే తన భర్త జ్యోతిబా పూలే మరణాంతరం 1875లో స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ద్వారా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం,వితంతు మహిళలకు ఆశ్రయ గృహాల కల్పన,1868లో కులాంతర వివాహాలు జరిపించడం,1877 లో కరువు బారిన పడ్డ జనాన్ని రక్షించడం మొదలగు ఎన్నో సామాజిక సంస్కరణ పోరాటాలను కొనసాగించిన గొప్ప యోధురాలు సావిత్రిబాయి పూలేనన్నారు.చివరికి ప్రాణం పోయేంతవరకూ సమాజ సేవలో ఉంటూనే ప్లేగు వ్యాధి సోకిన ఒక వ్యక్తికి సపర్యలు చేస్తూ వ్యాధి సోకి 1897 మార్చి10 మరణించిన గొప్ప మానవతా వాదిగా మనందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్,5వవార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వెంకటేష్,దళిత ప్రజా సంఘాల నాయకులు జీర్గల్ నగేష్, బీఎస్పీ అసెంబ్లీ ఇన్చార్జ్ పాలెం వెంకటయ్య,కే ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్, లింగన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోర్ల నర్సింలు, డీఎస్పీ నాయకులు తిమ్మరాజు, కర్రెం లింగప్ప, డ్రైవర్ అంజప్ప,పుడమి ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్,అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ సహాయ కార్యదర్శి,కోశాధికారి రవికుమార్, త్రిమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం ఉప్పరపల్లి అధ్యక్షులు బాలకృష్ణయ్య, స్వేరో జగ్గలి రవికుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పోర్ల నరేందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రెమ్ స్వామి,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బ్యాగరి శ్రీహరి,తల్వర్ నరేష్, ఉప్పరపల్లి మధు, రామ్ చరణ్, అరవింద్,సందీప్, తరుణ్, కర్రెన్ సురేష్,అనిల్,రాజు తదితరులు పాల్గొన్నారు.
