PS Telugu News
Epaper

రాష్ట్ర సచివాలయంలో గోదావరి పుష్కరాల నిర్వహణకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం .

📅 10 Mar 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ హైదరాబాద్. మార్చి 11.

క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు.రాబోయే గోదావరి పుష్కరాలను భక్తులకు సౌకర్యవంతంగా, భద్రంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్ల అభివృద్ధి, రహదారి సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై ఆయా శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Scroll to Top