సిద్దాపూర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిసిద్దాపూర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి
కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్
( పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని సిద్దాపూర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని విద్యతోనే వనితకు విముక్తి సాధ్యమన్న సామాజిక విప్లవ కరణి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన సంఘసంస్కర్త రచయిత సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసు నాయక్ తో పాటు పాఠశాల హెడ్మాస్టర్ రఘువీర్ మరియు గ్రామ సెక్రెటరీ కాజా బేగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి, మిస్రుత్ బేగం, హరికృష్ణ కుమార్, జనార్ధన్, పాషా మరియు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.