వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవ.పండగలు
పయనించే సూర్యుడు మార్చి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గంలో వైయస్సార్సీపీ 16వ వార్షికోత్సవ పండగలను ఘనంగా జరపాలని అధిష్టానం నిర్ణయించింది అందుగ్గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వసంతాలు పూర్తిచేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి.వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు… మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచనల మేరకు… రేపు అనగా 12-03-2026 ఉదయం 9గంటలకు నాయుడుపేట పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరుగును కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ మరియు మండల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశానుసారం సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ, వార్డుల్లోనూ, మండల స్థాయిల్లోనూ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా చేయాలని కోరుతూ… ఈ కార్యక్రమాల ఫోటోలను మరియు వీడియోలను నాయుడుపేటలోని కిలివేటి వారి క్యాంపు కార్యాలయానికి పంపవలసిందిగా కోరుచున్నాము న