PS Telugu News
Epaper

ముధోల్ ఎమ్మెల్యే కు సమస్యను విన్నవించిన అంగన్వాడి టీచర్లు

📅 11 Mar 2026 ⏱️ 5:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడి ఉపాధ్యాయులు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు వినతి పత్రాన్ని అందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడి టీచర్ల కు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు నెరవేర్చలా చూడాలని కోరారు. తమకు బి. ఎల్. వో. డ్యూటీ లు వేయకుండా చూడాలన్నారు. బి. ఎల్. వో డ్యూటీ లు వేయడం మూలంగా వృత్తి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అదే విధంగా పలు సమస్యలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అంగన్వాడీ టీచర్ల సమస్యల ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమం లో టీచర్లు డి. అనసూయ, ఎ. సంధ్యారాణి, ఎన్. సంతోషి, జి. సంధ్య తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top