నిర్మల్ పట్టణంలోని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణపై అవగాహన
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ , బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ,మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ,హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వారు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
