PS Telugu News
Epaper

పోరాటాల ద్వారా మాత్రమే కార్మిక హక్కులను కార్సాధించుకుంటాము. రమేష్ . బాబు వెల్లడి

📅 12 Mar 2026 ⏱️ 7:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండల కేంద్రంలో ఈరోజు గురువారం రోజున ఎర్రగట్ల మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సును నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటాలు చేయగలిగినప్పుడే పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని . ఇప్పటికే జరిగినా అనేక పోరాటాలలో మహిళలు ముందుండి ఉద్యమాలు నిర్వహించినారని మహిళా చైతన్యం మూలంగానే అనేక ఉద్యమాలలో విజయం సాధించటం జరిగిందని అందువల్ల ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే తమ హక్కులను సాధించుకోవచ్చని ఆయన అన్నారు. మహిళలు ఎన్నో పోరాటాలు చేసి కుటుంబం నుండి మొదలుకొని సమాజాభివృద్ధి కొరకు బాగానే ఉంటారని మహిళల చైతన్యం ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు . అనంతరం అనేక సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యమంలో సేవలు అందించిన అంగన్వాడి ఉద్యోగులకు మెమొంటోను అందజేసి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కే దేవగంగు అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర లేనిది ఏది లేదని అందువల్ల మహిళలకు సమానత్వం, గౌరవం కల్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు పద్మ, శారదాలతో పాటు, జ్యోతి, చంద్రకళ, యమునా, సునీత సూర్య అనురాధ ప్రేమల సంతోష పద్మ అమృత శారద తదితరులు పాల్గొన్నారు

Scroll to Top