PS Telugu News
Epaper

ముమ్మడివరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమం.

📅 13 Mar 2026 ⏱️ 7:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గారు పాల్గొని రైతులకు ఆర్థిక సహాయాన్ని లాంఛనంగా అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందిస్తూ రైతులకు మరింత మద్దతు కల్పిస్తోంది.ముమ్మిడివరం నియోజకవర్గంలో మూడవ విడత ఆర్థిక సహాయం గా మొత్తం 23,555 మంది రైతులకు రూ. 13.06 కోట్ల ఆర్థిక సహాయం అందజేయబడుతుందని తెలిపారు.మండలాల వారీగా చూస్తే ఐ. పోలవరం మండలం – 6197 మంది రైతులకు రూ.3.49 కోట్లు కాట్రేనికోన మండలం – 5627 మంది రైతులకు రూ.3.08 కోట్లు తాళ్లరేవు మండలం – 4036 మంది రైతులకు రూ.2.33 కోట్లు ముమ్మిడివరం మండలం – 7695 మంది రైతులకు రూ.4.16 కోట్లు.ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మొత్తం రూ.20,000 వరకు పెట్టుబడి సహాయం అందించబడుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెల్లి సురేష్, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ఎక్స్ ఎమ్మెల్యే వివేకానంద, చెల్లి అశోక్, సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరరావు ,తాడి నరసింహారావు, ఓగూరు భాగ్యశ్రీ , నడింపిల్లి సుబ్బరాజు, చెయ్యరు సొసైటీ అధ్యక్షులు టి శ్రీను, కూటమి నేతలు రైతు సోదర సోదరీమణులు రైతు కార్మికులు, కౌలు రైతులు మీడియా మిత్రులు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top