PS Telugu News
Epaper

కవిత్రి మొల్ల ఘనంగా జయంతి వేడుకలు

📅 14 Mar 2026 ⏱️ 2:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి

కవిత్రి మొల్ల జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ పసుపులేటి మహాలక్ష్మి రావు వారి అధ్యక్షతన అంబాజీపేట మండలం మాచవరంలోని శ్రీ శాలివాహన కమ్యూనిటీ హాల్‌లో మొల్ల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్ల పవన్ కుమార్ హాజరై, కవిత్రి మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పసుపులేటి మహాలక్ష్మి రావు వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య చరిత్రలో ఆదికవి నన్నయ ఎలా ఆదికవిగా నిలిచాడో, అలాగే మొల్ల ఆదికవయిత్రిగా నిలిచిందని పేర్కొన్నారు.ఆమె రచించిన మొల్ల రామాయణం అచ్చ తెలుగులో, సరళంగా, హృద్యంగా ఉండే రామకథ. ఇది కేవలం ఒక కావ్యం కాదు – సామాన్యులకు రాముడి ఆదర్శాలను చేరవేసిన ఒక దీపం అని వివరించారు.ఆ కాలంలో స్త్రీలకు విద్య అందుబాటులో లేకపోవడం, శాస్త్రాలు, సంస్కృతం చదవడం దూరంగా ఉండటం వంటి పరిస్థితుల్లోనూ మొల్లకు సహజ ప్రతిభ ఉంది. ఆమె తన అవతారికలో ఇలా అంటుంది:”నాకు పాండిత్యం లేదు, భగవద్వరప్రసాదమే నా కవిత్వానికి కారణం. శ్రీకంఠ మల్లేశ్వర స్వామి వరంతోనే నేను కవిత్వం చెప్పగలిగాను” అని.ఆమె బ్రాహ్మణేతర కుటుంబం నుంచి వచ్చిన మొదటి కవయిత్రి. రాజాస్థానాల అండ లేకుండా, స్వంత ప్రతిభతో రామాయణాన్ని రచించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జీవించిందని చరిత్రకారులు చెబుతారని గుర్తు చేశారు.మొల్ల అచ్చ తెలుగు – సరళ భాషలో రచించింది: సంస్కృత భారం లేకుండా, ఇంటిలో మాట్లాడే తెలుగు పదాలతో రాసిందని పేర్కొన్నారు. అనంతరం శాలివాహన మహిళలను సమావేశంలో పాల్గొన్నవారు పూలమాలలు, అలంకరణతో ఘనంగా సన్మానించారు.గత ప్రభుత్వాలు ఇలాంటి మంచి వ్యక్తుల చరిత్రను మరుగుపరిచాయని, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించి, ఇలాంటి సమాజ సేవకులను వెలుగులోకి తీసుకువస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కన్వీనర్ శ్రీ ఇళ్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ చీకరమెల్లి శ్రీనివాసరావు, శ్రీ సలాది వీరబాబు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సిరిగినీడి వెంకటేశ్వరరావు, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి శ్రీ కముజు శ్రీనివాసరావు, పి.గన్నవరం మండల అధ్యక్షులు శ్రీ తిక్కా సత్యనారాయణ, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు మానేపల్లి వీరబ్రహ్మం, ఆర్గనైజింగ్ కార్యదర్శి అందుర్తి నారాయణ, బిజెపి సీనియర్ నాయకులు దొడ్డిపట్ల శ్రీనివాసరావు, పేరూరి విశ్వనాథం, బిజెపి అంబాజీపేట మండల అధ్యక్షులు ఆంజనేయులు మొల్ల జయంతి ఉత్సవాల జిల్లా ఇన్చార్జ్ చిరంజీవి, అంతర్వేది నాగలక్ష్మి దేవి, జిల్లా కార్యదర్శి శ్రీమతి మోకా ఆదిలక్ష్మి, సత్యనారాయణ తదితరులు అధిక సంఖ్యలో శాలివాహన సంఘ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top