ముధోల్ నియోజకవర్గం లోని 9 గ్రామపంచాయతీ భవనలకు నిధులు విడుదల
పయనించే సూర్యుడు నిర్మల్ బ్యూరో కలివెలుగుల చక్రపాణి
ముధోల్ నియోజకవర్గం లోని పలు గ్రామపంచాయతీ లకు ఒక్కొక్క గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున 1 కోటి 80 లక్షల రూపాయలు మరియు 11 గ్రామాలకు ఒక్కొక్కటి 12 లక్షల చొప్పున అంగన్వాడీ భవనములు 1 కోటి 32 లక్షలు మంజూరైనవి. మొత్తం కలిపి 3 కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరైనవి. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు గౌరవ నిర్మల్ జిల్లా కలెక్టర్ ముధోల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి