PS Telugu News
Epaper

గుడేబల్లూరులో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📅 14 Mar 2026 ⏱️ 4:53 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {మార్చ్ 15}

ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండల గూడెబల్లూర్ గ్రామం లో జనసేనపార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజు జనసేన పార్టీ కట్ట నిర్మాణం మరియు పార్టీ పతాక ఆవిష్కరణ పూజారి కృష్ణమూర్తి గుడిపేపు ఆంజనేయులు మరియు చక్రవర్తి ఆధ్వర్యం లో చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్.ముఖ్య అతిథిగా హాజరు అయి ఈ రోజు జనసేనపార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేనపార్టీ కృష్ణ మండలం లో పతాక ఆవిష్కరణ జరగడం గొప్ప విషయం గూడెబల్లూర్ యువకులను డాక్టర్ మణికంఠ గౌడ్ పార్టీ కండువా కప్పి 50 మంది యువకులను స్వచందంగా పార్టీ లో కి ఆహ్వానించారు గ్రామ జనసైనికులు కష్టపడి ఈ కార్యక్రమo నిర్వహించారు వారికి మరియు ఇక్కడ కష్టపడిన కృష్ణ గ్రామ ప్రతి జనసైనికుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
మన అధినేత పవన్ కళ్యాణ్ మన లాంటి సామాన్య యువకుడికి రాజకీయాల్లో రావాలని అవినీతి లేని రాజకీయం రావాలని ఒక మంచి సంకల్పంతో జనసేన పార్టీ ని 2014 లో తెలంగాణ నడిగడ్డ పైన హైదరాబాద్ లో పార్టీ ని స్థాపించడం జరిగింది పది సంవత్సరాలు పోరాటం చేసి ఈ రోజు ఎన్డీయే కూటమి లో ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం లో అధికారం లోకి వచ్చింది రానున్న ఎన్నికలలో జనసేనపార్టీ తెలంగాణ లో కూడా బలోపేతం అయి అధికారం లో కి రావడం ఖాయం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో మక్తల్ నియోజక వర్గ నాయకులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు

Scroll to Top