PS Telugu News
Epaper

కృష్ణ మండల కేంద్రంలో జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ

📅 14 Mar 2026 ⏱️ 4:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

// పయనించే సూర్యుడు// మార్చ్ 15

ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండల కేంద్రంలో T రమేష్ ఆధ్వర్యం లో జనసేనపార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా కట్ట మరియు పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మక్తల్ నియోజక వర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్. హాజరు అయి గ్రామ జనసేన నాయకులకు నూతనంగా పార్టీ లో కి చేరిన జనసైనికులకు జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణ మండలం ఒక మారుమూల ప్రాంతం లో కూడా జనసేన పార్టీ జెండా ఎగిరిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్. ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు సేవ చేస్తున్న తీరు చూసి ఈ రోజు దేశం లో ఎంతో మంది జనసేన వైపు చూస్తున్నారు అని ఆయన అన్నారు పుష్కర కాలం పాటు కష్టపడి ఆంధ్రప్రదేశ్ కూటమి లో భాగం అయ్యాం తెలంగాణ లో కూడా రానున్న కాలం లో పార్టీ అధికారం లో రాబోతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమ లో కృష్ణ మండలం యువకులు స్వచందంగా పార్టీ లో చేరారు వారిని డాక్టర్ మణికంఠ గౌడ్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు మక్తల్ నియోజకవర్గ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Scroll to Top