PS Telugu News
Epaper

అశ్వాపురం పంచాయతీ పాలకవర్గం సాధారణ సమావేశం

📅 14 Mar 2026 ⏱️ 6:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, మార్చి 14,అశ్వాపురం :

అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన సాధారణ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం తో పాటు, వేసవి కాలం సమీపిస్తున్న దృష్ట్యా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వార్డుల వారిగా సమీక్ష, పారిశుధ్య, విధీదిపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు ఘనంగా ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు ఈ రోజు గ్రామ పంచాయతీ ఆవరణ యందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు పాలక వర్గ సభ్యులు, సర్పంచ్ సదర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ వారు నిండు నూరేళ్ళు సంతోషంతో ఆనందంగా గడపాలని ఇటువంటి ఎన్నో మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని భగవంతుడిని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top