నారాయణపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
:పయనించే సూర్యుడు: మార్చ్ 15
ఈ రోజు నారాయణపేట జిల్లా నారాయణపేట నియోజక వర్గ కేంద్రం లో జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జెండా కట్ట మరియు పతాక ఆవిష్కరణ కార్యక్రమం ను పండగ వాతావరణం లాగా నారాయనపేట జనసైనికులు జరుపుకున్నారు
నారాయణపేట ఇంచార్జ్ పవన్ కుమార్ మరియు రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్.ఆశయాలు పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి నారాయణపేట జిల్లా కేంద్రం లో మొదటి సారిగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభించడం జరిగింది అంటే ఇక్కడ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంకటేష్ కృష్ణ ఎంతో కష్టపడి ఒక అడుగు ముందుకు వేసి మెగా అభిమానులను జనసైనికులను ఏకతాటిపైకి తెచ్చి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఇంత పెద్ద పండుగలగా జరగడానికి కారణం అయ్యారు మన అధ్యక్షుల వారు పుష్కర కాలం పాటు ప్రజా సమస్యలపైన పోరాడి ప్రజల మన్నలను పొంది ఎన్డీయే కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయ్యారు
మరియు అదేవిధంగా మనమంతా పార్టీ కోసం కష్టపడి పని చేయాలని మన అధినేత పవన్ కళ్యాణ్. ఆశయాలను నారాయణపేట జిల్లా వ్యాప్తంగా గడప గడప కు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో మక్తల్ నియోజక వర్గ నాయకులు రామన్ గౌడ్ గౌడి బాల్ రెడ్డి బాదేపల్లి నరేష్ గౌడ్ పీకే ప్రవీణ్ మరియు నారాయణపేట నియోజకవర్గ నాయకులు అశోక్ కుమార్ బల్రామ్ జీతూ పటేల్ రామకృష్ణ కొడంగల్ నియోజవర్గ నాయకులు అరుణ్ కుమార్ గౌడ్ అశోక్ కుమార్ ఆంజనేయులు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

