PS Telugu News
Epaper

యుద్ధ పిపాసను వీడాలి – ప్రపంచ శాంతిని కాపాడాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్

📅 14 Mar 2026 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్

​ ( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

​యుద్ధం మరియు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఇచ్చిన పిలుపులో భాగంగా, ఈరోజు జిల్లెడు చౌదరి గూడెం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ వినూత్న నిరసన చేపట్టారు.​ఈ సందర్భంగా ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల మధ్య అశాంతిని రేపుతూ, తన ఆర్థిక లాభాల కోసం అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద రాజకీయం వల్ల అమాయక ప్రజలు, విద్యార్థి లోకం బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల వల్ల విద్యా, వైద్య రంగాలకు అందాల్సిన నిధులు ఆయుధాల పాలు అవుతున్నాయని, ఇది మానవ వికాసానికే గొడ్డలి పెట్టు అని విమర్శించారు. టారిఫ్‌ల పేరుతో పేద దేశాలపై రుద్దుతున్న ఆర్థిక వలసవాదాన్ని విద్యార్థి లోకం ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ​ప్రపంచ దేశాలు తక్షణమే యుద్ధ మార్గాన్ని వీడి శాంతియుత చర్చలు జరపాలి.​ఆయుధాల తయారీకి వెచ్చించే బడ్జెట్‌ను విద్య మరియు ప్రజా సంక్షేమానికి మళ్లించాలి.​అమెరికా ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు మరియు సామ్రాజ్యవాద పోకడలు నశించాలి.​అంబేద్కర్ గారి ఆశయమైన అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని కాపాడాలని, యుద్ధ రహిత ప్రపంచం కోసం ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి విద్యార్థులు నాయకులు, సామాజిక నాయకులు,బాబా శివ జాకెర్ పాల్గొని తమ మద్దతు తెలిపారు.

Scroll to Top