PS Telugu News
Epaper

శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు

📅 14 Mar 2026 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 14 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటివాండ్లపల్లిలో నిర్వహించిన శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు గారు,మండల పార్టీ అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు నేతలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే గ్రామస్తులు సుగవాసి ప్రసాద్ బాబు , మహేష్ నాయుడు , రమేష్ నాయుడు గారిని ఘజమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ శ్రీ సీతారాముల ఆశీస్సులతో గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలను ఆయన అభినందించారు.

Scroll to Top