PS Telugu News
Epaper

10 వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి

📅 14 Mar 2026 ⏱️ 7:41 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి

ఈ నెల 16 వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఎక్కడ కూడా ఒత్తిడికి గురి గాకుండా, ప్రశాంతత,ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి తమ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.సంవత్సరం పొడవునా చేసిన కృషి ఫలితాన్ని చూపించే సమయం ఇదేనని, ప్రతి విద్యార్థి ప్రశాంతంగా ప్రశ్నపత్రాన్ని సమాధానపరిచి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. పరీక్షలకు వెళ్లే ముందు తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశిస్తూ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ధైర్యం చెప్పి వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి కోరారు.

Scroll to Top