PS Telugu News
Epaper

నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ద కుంట్ల శ్రీనివాస్ రెడ్డి

📅 19 Mar 2026 ⏱️ 11:51 AM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

తెలుగు ప్రజల సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన ఉగాది పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర ఆరంభాన్ని సూచించే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాలు, ఆశలు నింపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడనే విశ్వాసం ఉందని తెలిపారు. ‘యుగ’ అంటే కాలం, ‘ఆది’ అంటే ప్రారంభం అని, కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టే పవిత్రమైన రోజు ఉగాది అని వివరించారు.
ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, ఈ రోజున తయారు చేసే షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. వేపపువ్వు నుంచి బెల్లం వరకు ఆరు రుచుల సమ్మేళనం మనిషి జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభూతులకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.ఇక పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకోవడం తెలుగు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగమని, ప్రజలు నూతన ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు. వసంత ఋతువు ఆరంభంలో ప్రకృతి కొత్త చిగుర్లతో కళకళలాడే వేళ ఉగాది రావడం విశేషమని అన్నారు.శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.

Scroll to Top