భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని ప్రజావాణిలో ఫిర్యాదు..

పయనించే సూర్యుడుD17.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.భీంగల్ మండలం భీంగల్ గ్రామంలోని నంది గల్లి ఆర్ టి సి బస్సు డిపో పక్కన ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి నమోదయిందని తెలిపారు.. 2011.17 కాలానికి సంబంధించిన మీ సేవ దృవీకృత పహాని అడం గల్ పత్రాలతో పాటు2012to. 13. to2015. to. 16 వరకు ఉన్న పాత రికార్డులలోను ఈ భూమి వివరాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు అయితే 20 17 సంవత్సరం నుండి తదుపరి రెవెన్యూ రికార్డులోనికి ఈ భూమి వివరాలు కనిపించకపోవడంపై విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు రికార్డులలో మార్పులు ఎందుకు జరిగాయి ఎవరి ఆదేశం మేరకు జరిగాయి ఏ ఉత్తర్వులు లేదా ప్రక్రియల ఆధారంగా మార్పులు చేశారని అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సంఘ సభ్యులు కోరారు పాతప పహాని అడం గల్..1. బి సెట్ వర్క్ తదితర రికార్డులతో పాటు ప్రస్తుత డిజిటల్ రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వాస్తవాలు నిరూపించాలి దేవాదాయ భూమికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు రికార్డ్‌లలో అక్రమ మార్పులు లేదా తొలగింపులు జరిగినట్లే విచారణలోనికి తేలితే బాధ్యతలపై నిబంధనాల ప్రకారం చర్యలు తీసుకోవాలని విష బ్రహ్మన సంఘ సభ్యులకు కోరారు