PS Telugu News
Epaper

యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్.

📅 20 Mar 2026 ⏱️ 5:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి స్టేట్మెంట్
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అన్నారు ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది అన్నారు వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాలు అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది అన్నారు, ఉగాది సందర్బంగా యువతకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపొందిoచి రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని అన్నారు, ఈ జాబ్ క్యాలెండర్ పోలీస్ ఉద్యోగాలకు పెద్ద పీట వేసింది, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే డి ఎస్ సి ద్వారా 16000 ఉపాధ్యాయ పోస్ట్లు భర్తీ చేసి మరల నేడు 3000 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందాని, ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 3000 జూనియర్ లెక్చలర్ పోస్ట్లు కేటాంచడం జరిగిందని, ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో 1500 అధ్యాపక పోస్ట్లు భర్తీ చేస్తుందని, గ్రూప్ 1, గ్రూప్ 2 ద్వారా 600 పోస్ట్లు, కానిస్టేబుల్ 1000 పోస్ట్లు, ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్ట్లు ఈ జాబ్ క్యాలెండర్ లో కేటాయించడం జరిగిందని, అన్నమాట ప్రకారం నిరుద్యోగులకు మెగా డి ఎస్ సి ద్వారా 16000 వేల టీచర్ పోస్ట్లు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అని, నేడు మరల జాబ్ క్యాలెండర్ రూపొందించి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారని, జగన్ ప్రభుత్వం ఒక్క డి ఎస్ సి కూడా వేయకుండా, జాబ్ క్యాలెండరు ప్రకటిస్తాం అని యువతను, నిరుద్యోగులును నిలువునా మోసం చేసారని, జగన్ పాలనలో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకున్నారని, నిరంతరం యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు, యువత అండగా నిలవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అన్నారు.గుత్తుల సాయి

Scroll to Top