PS Telugu News
Epaper

నిర్మల్ జిల్లా నూతనంగా ఎంపికైన డీసీసీ కమిటీ సభ్యులకు మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ సన్మానo

📅 20 Mar 2026 ⏱️ 5:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

ముధోల్ నియోజకవర్గం నుండి ఎన్నికైన డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు బైంసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ ఆధ్వర్యంలో సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా నూతనంగా నిర్మల్ జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి ఎన్నికైన సభ్యులను మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ శాలువాలతో సత్కరించి అభినందించారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top