త్వరలోనే పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ.
స్వచ్ఛంద విరాళాల సేకరణ.
:పయనించే సూర్యుడు: :మార్చ్ 22మక్తల్ : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయులు మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మక్తల్ పట్టణ కేంద్రంలోని కర్ని క్రాస్ రోడ్ దగ్గర పూలే చౌరస్తాలో ఏర్పాటు చేయాలని మక్తల్ పట్టణ కేంద్రానికి చెందిన ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో గతంలో అమరుడు నర్సింలు టీచర్ ఏర్పాటుచేసిన జ్యోతిబాపూలే విగ్రహంతో పాటు కొత్తగా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ ఇద్దరి మహనీయులను గౌరవించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. ఈ క్రమంలో ఈ మహత్తర కార్యక్రమానికి మక్తల్ పట్టణ ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. అతి త్వరలోనే ఈ మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవలసిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. దళిత బహుజన చైతన్యం కలిగిన మక్తల్ పట్టణంలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మనందరి చైతన్యానికి నిదర్శనమని అన్నారు.ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని మక్తల్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దత్తాత్రేయ అడ్వకేట్, కె.రామాంజనేయులు గౌడ్,బీసీఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు. డి.హెచ్.జి.పోలప్ప నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు. మద్దిలేటి – మానవ హక్కుల కార్యకర్త, పృథ్వీరాజ్ -అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు,సూర్యచంద్ర – డిటిఎఫ్,ఈసారి శ్రావణ్ కుమార్ -జ్యోతిరావు పూలే బీసీ సంఘం నాయకులు,జీర్గల్ నాగేష్ మాదిగ,దళిత నాయకులు.బి.కృష్ణ – అంబేద్కర్ యువజన సంఘం ప్రధానకార్యదర్శి,బండారి వెంకటేష్ – సామాజిక కార్యకర్త,బాలకృష్ణ – ఉప్పరపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, జి.రంగప్ప యాదవ్ బీసీ ఐక్యవేదిక – రాష్ట్ర కోశాధికారి,
రాజశేఖర్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు, కె. అశోక్ గౌడ్, వడ్డే రవికుమార్ , బండారి ఆనంద్ , బండారి రవికుమార్ , బండారి మల్లేష్ టి. నరేష్.తదితరులు పాల్గొన్నారు.