PS Telugu News
Epaper

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

📅 23 Mar 2026 ⏱️ 4:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 24/03/26

మండల కేంద్రంలోని గౌరారం లో గల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్, సుఖదేవ్ మరియు రాజ్ గురుల వర్ధంతిని విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయులు నిర్వహించారు. భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు, అతివాద విప్లవకారుడు పంజాబ్లో జన్మించిన ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇక్విలాబ్ జిందాబాద్ నినాదంతో యువతలో స్ఫూర్తి నింపారని ఉపాధ్యాయులు ఉమాకాంత్, బాబు తెలిపారు. సెప్టెంబర్ 28, 1907 నాడు భగత్ సింగ్ పంజాబ్లో కిషన్ సింగ్ విద్యావతి దంపతుల కుమారుడని ప్రధానోపాధ్యాయులు రాములు అన్నారు. జలియన్వాలాబాగ్ దురంతం 1919 తీవ్రంగా కలచి వేసిందని విప్లవాత్మక మార్గం వైపు వెళ్లి బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించారని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య తెలిపారు. ఇలాంటి స్ఫూర్తితో విద్యార్థిని విద్యార్థులు పోటీ పడాలని తెలిపారు.

Scroll to Top