కామోల్ గ్రామంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ మాతకు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం తులసీ మాత, గోమాతలకు పూజలు నిర్వహించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ శ్రీహరి మౌనస్వామి రోటిగూడ పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అలాగే గ్రామ పురోహితులు శ్రీ నర్సింహరావ్ జోషి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. ప్రతిరోజూ భజనలు, కీర్తనలు, ప్రత్యేక పూజలతో ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయి.
