PS Telugu News
Epaper

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం

📅 23 Mar 2026 ⏱️ 6:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సలహాదారులుగా నిజాంబాద్ జిల్లా పట్టణ వాస్తవ్యులు అందేలా భవాని లక్ష్మి…ఈరోజు నిజాంబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సందర్భంగా నిజాంబాద్ పట్టణ వాస్తవ వివరాలు అందేలా భవాని లక్ష్మి రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర సలహాదారులుగా నియమించినందుకు గాను నిజాంబాద్ ప్రెస్ క్లబ్లో సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ సలీం మాట్లాడుతూ అన్నారు అలాగే ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సంబంధిత శాఖల ద్వారా దరఖాస్తు చేసుకున్నచో 30 రోజులలో సంబంధిత అధికారులు పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు ఒకవేళ ఏ అధికారి అయిన సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించినచో సెక్షన్ 18(1 )ప్రకారంగా రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసినచో ప్రతిరోజు రూపాయలు 250/- రూపాయలు చొప్పున 25 వేల వరకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్ ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే నూతనంగా నియమితులైన రాష్ట్ర సలహాదారులు అందేలా భవాని లక్ష్మీ రెడ్డి ని మొమెంటు పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగినది.ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప అధ్యక్షుడు కేతు రమణారెడ్డి,న్యాయవాది ఈక శ్రీనివాస్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంతపు గంగాధర్, నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిహెచ్ ప్రకాష్, మహిళా అధ్యక్షురాలు సునీత,న్యాయ విభాగ కార్యదర్శి శ్యామల,శ్రీనివాసరావు,, ప్రతినిధులు ప్రభుదాస్, శ్రీనివాస్ రాజేశ్వర్, తెలంగాణ రాష్ట్ర దండోరా మహిళా అధ్యక్షురాలు రోజా రాణి, ప్రతినిధులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ కుమార్ మహిళా ప్రతినిధులు గంగా నర్సవ్వ తోట, స్వరాజ్యలక్ష్మి,మొహమ్మద్ ముసవీర్, వంశీ రూప, భూమా, తదితరులు పాల్గొన్నారు.అందెల భవాని లక్ష్మీరెడ్డి రాష్ట్ర సలహాదారులు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ

Scroll to Top