PS Telugu News
Epaper

అమలాపురం గ్రామ దేవత సుబ్బాలమ్మ తల్లిని దర్శించుకున్న నాయకులు

📅 25 Mar 2026 ⏱️ 3:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చ్ 25 అమలాపురం

అమలాపురం గ్రామదేవత, స్థానిక ప్రసిద్ధ దేవాలయమైన సబ్బాలమ్మ తల్లి ఆలయాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయ ప్రముఖులైన అముడ చైర్మన్ అల్లాడ సోము బాబు, బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, మోకా వెంకట సుబ్బారావు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్, జి.రోహిణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ దర్శన కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top