ఎంపిఎల్ విజేతలకు బహుమతుల పంపిణీ..
:పయనించే సూర్యుడు: :న్యూస్ 26మక్తల్:
మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో నిర్వహించిన మంథన్ గోడ్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి గా 15000, రెండో బహుమతి కింద పదివేల రూపాయలను విజేతలకు దాతలు ఉప్పరి అశోక్ సాగర్, గువ్వల తిరుపతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడా పోటీలు యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు ఐక్యతను బలోపేతం చేస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రీడలకు సమయం కేటాయించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు పాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
