గ్రంధి నానాజీ కి ఘన సత్కారం
పయనించే సూర్యుడు మార్చి 26 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన మండల ప్రెస్ క్లబ్ ట్రెజరర్ గా నూతనంగా నియమితులైన గ్రంధి సూర్యనారాయణ గుప్తా(నానాజీ) ను రావులపాలెం లో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోలకోటి వెంకట రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, అయినవిల్లి మండల అధ్యకులు యనమదల వెంకటరమణ పాల్గొన్నారు.
