శాసన సభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ శాఖ కు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21 A ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ (జక్రాన్ పల్లి మండలం)లో 1,10,000 ఎకరాలు,కోరుట్ల నియోజకవర్గంలో 19,000 ఎకరాలు,ఆర్మూర్ నియోజకవర్గంలో 5,000 ఎకరాలు.ఈ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 70% పనులు పూర్తి అయ్యాయి.మిగిలిన 30% పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు అని దీనిద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇందులోనే భాగమైన మెట్ పల్లి సెగ్మెంట్ ప్యాకేజీ 21 A లోనే బాల్కొండ నియోజకవర్గం 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ జక్రాన్ పల్లి మండలం 29,000 ఎకరాలు, కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి, ఇబ్రహీపట్నం ప్రాంతంలో 19,000 ఎకరాలు, ఆర్మూర్, మాక్లూర్ లో 5000 ఎకరాలు మొత్తంగా సుమారు 1,20,000 ఎకరాలు ఉంటుంది.ఈ పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెట్ పల్లి సెగ్మెంట్ పనులల్లో హెడ్ వర్క్స్, పంపు హౌజ్, మెయిన్ పైప్ లైన్ పూర్తి అయ్యి దాదాపు 80% పనులు పూర్తయ్యాయని, కేవలం మరో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 1.20 లక్షల ఎకరాలకు 3 నుండి 6 నెలల్లో నీరు అందించవచ్చని, మరో 1000 కోట్లు ఖర్చు చేస్తే మిగతా 80000 ఎకరాలకు సాగున్నీరు అందించవచ్చని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మొత్తము ప్రాజెక్ట్ లో 70 శాతం ఖర్చు చేయబడింది కావున మిగతా నిధులు మంజూరు చేసిన ప్యాకెజ్ 21 ప్రజాక్ట్ ని పూర్తి చేయాలనీ కోరారు. *ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబదించిన చిట్టాపూర్-ఫతేపూర్-సుర్బిర్యాల్ లిఫ్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో SRSP నుండి 9,274 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టిందని,ఇందులో బాల్కొండ నియోజకవర్గంలో లోని బాల్కొండ, చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాలకు 60 కోట్లతో 3400 ఎకరాలకు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఫాతేపూర్, సుర్బిర్యాల్ గ్రామాలకు 90 కోట్లతో 5700 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అన్నారు.
గత హయాంలోనే 20% పనులు పూర్తయ్యాయని గత రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే అన్నారు. తక్కువ ఖర్చుతోనే ఒక్క ఎకరానికి సాగునీరు అందించే అవకాశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉందని తక్షణమే ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ని పలు సార్లు కలిసి విన్నవించడమే కాకుండా గత అసెంబ్లీ సమావేషాల్లో ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పనుల్లో ఇప్పటికి ఎలాంటి కదలిక లేదని ఇప్పటికైనా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
