PS Telugu News
Epaper

కుమారుని జన్మదినం సందర్బంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ

📅 26 Mar 2026 ⏱️ 6:50 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

//పయనించే సూర్యుడు// మార్చ్ 27మక్తల్ //

ఉప్పరపల్లి గ్రామ వాస్తవ్యులు శేఖర్ మరియు చంద్రకళ దంపతులు తమ రెండవ కుమారుడు ప్రియాన్స్ ఆర్య యొక్క జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు మరియు నోట్ పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది.అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవితేజ. మాట్లాడుతూ శేఖర్ తన కుమారుని జన్మదిన వేడుకలను పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం మంచి సంప్రదాయమని దంపతులను కొనియాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవీందర్. మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల మధ్య తన కుమారుని జన్మదిన వేడుకలు జరుపుకున్న శేఖర్ మునుముందు కూడా పాఠశాలకు సహకారం అందించాలని,శేఖర్ ను ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులు పెళ్లిరోజు సందర్భంగా గాని, పుట్టినరోజు సందర్భంగా కానీ పాఠశాలకు వనరులు సమకూర్చి, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు ఆంజనేయులు గ్రామ పెద్దలు దామోదర్ రెడ్డి, కిష్టప్ప, శాంతప్ప, రాజు, ఇంగ్లిష్ ఆంజనేయులు, సిద్దు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top