భైంసా లో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహణ
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (జి.డి.సి) భైంసా లో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ శ్రీ కె. బుచ్చయ్య అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్, సమన్వయకర్త డా. రవి కుమార్, ప్రవేశాల సమన్వయకర్త డా. భీమా రావు హాజరయ్యారు.సమావేశంలో డా. సంతోష్ కుమార్ కళాశాల సాధించిన విజయాలు, విద్యా ప్రమాణాల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, మరియు వివిధ అకాడమిక్ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. తల్లిదండ్రులు విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలు మరియు సూచనలు తెలియజేశారు.అనంతరం తల్లిదండ్రుల కమిటీని ఎన్నిక చేశారు. అధ్యక్షుడిగా శ్రీ అష్వాక్ అహ్మద్, ఉపాధ్యక్షుడిగా శ్రీ కాజీ వసీం అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా మరుతి, కోశాధికారిగా శ్రీమతి నాగమ్మ ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సయ్యద్ మొహినొద్దీన్, అబ్దుల్ మతీన్, జాదవ్ ఎవరామ్ ఎన్నికయ్యారు.ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మరింత బలపడుతుందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
