ఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలను జరిపారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కోలన్ నరసింహారెడ్డి నాయకత్వం వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన పార్టీగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.గతంలో ఎన్టీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా కృషి కొనసాగుతోందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కోలన్ జనార్దన్ రెడ్డి, ధూళిపాళ్ల రాజేష్, కొడాలి రవి కుమార్, ఆకుల సతీష్, శశికాంత్, డివీఎస్ ప్రసాద్, గుర్రం రాము, కావూరీ వినయ్, సూర్య ప్రసాద్, తాళ్లూరి రమేష్, నరావుల సురేష్, నందమూరి మంగమూరి వెంకట్, వల్లభనేని రాజేష్, అశోక్, శ్రీనివాస్, ధూళిపాళ్ల సురేష్, విజయ్, బండ్ల రాము, శ్రీనివాసరావు, బి. అశోక్, జి. భరత్, మాధవరావు, సుమంత్, తుపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
