మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
పయనించే సూర్యుడు మార్చు 31మక్తల్
మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యులుగా వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, సరస్వతీ బాయి, హషియా బేగం సోమవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో ఈ ఎన్నిక ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పుర చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నూతన సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.
